![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -897 లో.. వసుధారని రిషి ఎండీ చైర్ లో కూర్చోపెట్టి వర్క్ చేసుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి ఇచ్చిన హార్ట్ షేప్ గిఫ్ట్ ని వసుధార తీసుకొని ఎండీ చైర్ లో పెడుతుంది. నేను మీ స్థానంలో ఉంటాను కానీ మీ చైర్ లో కూర్చొలేనని పక్కన ఒక చైర్ వేసుకొని అందులో కూర్చొని వసుధార వర్క్ చేస్తుంది.
మరొక వైపు ఎండీగా వసుధారకి బాధ్యతలు ఇవ్వడంతో దేవయాని, శైలేంద్ర అసంతృప్తితో ఉంటారు. కొన్ని రోజులకి వసుధార ఎండీగా అనర్హురాలని తెలుస్తుందని దేవాయనితో శైలేంద్ర అనగానే.. అప్పుడే వచ్చిన రిషి వింటాడు. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య మీరు వసుధారని ఎండీ చైర్ లో కూర్చొపెట్టిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా.. నేను కేవలం వసుధారకి, అర్హత చూసి మాత్రమే ఇచ్చానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రిషి చెప్తాడు.. వసుధార టాలెంట్ మనకి తెలుసు కదా అని దేవయాని నటిస్తూ మాట్లాడుతుంది. కొన్ని రోజుల తర్వాత వసుధార అర్హురాలో? అనర్హురాలో తెలుస్తుంది కదా అని దేవయాని చెప్తుంది. సారీ రిషి అని శైలేంద్ర చెప్తాడు. ఇంకెప్పుడు అలా ఆలోచించకండని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. మరొక వైపు వసుధార వర్క్ చేస్తుంటే దేవాయని, శైలేంద్ర వెళ్లి వసుధారకి కోపం వచ్చేలా మాట్లాడుతారు.
ఆ తర్వాత నీకు ఈ పనుల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను చెప్పని శైలేంద్ర అనగానే.. అవసరం లేదని వసుధార కోపంగా చెప్తుంది. శైలేంద్ర, దేవయాని మాట్లాడే ప్రతి మాటకు వసుధార కౌంటర్ వేస్తుంది. నాకు వర్క్ ఉంది దయచేసి ఇక్కడ నుండి వెళ్లిపోండని వసుధార డైరెక్ట్ గా చెప్పగానే.. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాత్రి వసుధార సోఫాలో వణుకుతు నిద్రపోవడం చూసిన రిషి.. వసుధారని ఎత్తుకొని తీసుకొని వెళ్లి తన గదిలో పడుకోబెడుతుండగా వసుధార నిద్ర నుండి లేస్తుంది. మీరెదుకు తీసుకొని వచ్చారని రిషిని అడుగుతుంది వసుధార. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు.. అప్పుడే మహేంద్ర తాగి బెడ్ మీద నుండి కిందకి పడిపోయి గట్టిగా అరుస్తాడు. దాంతో రిషి, వసుధార ఇద్దరు మహేంద్ర దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |